మనసుకి, ఆలోచనలకు, చేతలకి దూరం తగ్గించి, మనసు పెట్టి సమాజసేవ చేస్తున్నది మన అమ్మ స్వచ్ఛంద సంస్థ.
"ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేదు.." అన్నట్లు, మందిహితం, సమాజహితం కోసం, కుల-మత-ప్రాంతాలకు అతీతంగా పనిచేయడం ఉద్యమంగా ఆచరిస్తోంది అశ్వ.
ప్రజల నిజమైన అవసరాల కొరకు చేసే పని పవిత్రమైనది. అట్టి కార్యక్రమం అశ్వ చేస్తోంది.
అమ్మ స్వచ్ఛంద సంస్థ చేపట్టిన మరో అద్భుతమైన కార్యం .. ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన. సరైన కాలంలో, సరైన పనులను చేస్తూ సరైన మార్గం చూపుతూ, ఆశావాదాన్ని కలిగిస్తోంది అశ్వ.
మనం ఎంత ఎత్తుకి ఎదిగినా, సమాజానికి తిరిగివ్వకపోతే వెలితిగానే ఉంటుంది. మన దేశం లో ఎన్ని సమస్యలున్నా మన సమాజం లో వితరణశీలత ఉన్నది. 84 శాతం కుటుంబాలు ఏదో ఒక వితరణ చేస్తున్నాయి. మన దేశం లో విద్యకు అన్నీ ఉన్నా ప్రపంచస్థాయి విద్యార్థులు నూటికి 20 మందే తయారవుతున్నారు. ఈ విషయం లో ASWA చేస్తున్న కృషి చూస్తుంటే నాలో ఆశావాదం
పెరుగుతోంది. అశ్వ మనసుపెట్టి మంచిపని, విలువైన పని, దీర్ఘకాలం పనికొచ్చే పని చేస్తోంది.
Comments