మన అశ్వా (aswa4u.org) 11వ వార్షికోత్సవ సభకు అతిధిగా విచ్చేయడమే కాదు జీవన విద్య గురించి విని, అభినందించి, ప్రదీప్ సర్ చాలా సరళంగా, అందరికి అర్ధమయ్యే విధంగా చెప్పారని సభాముఖంగా తెలియచేసి, పక్క రోజు దాదాపు ఒక గంట పాటు ఫోన్ ఈ జ్ఞానం గురించి మాట్లాడారు శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి వారు...
ఆ సభలోనే... అశ్వా ఇప్పటిదాకా చేస్తున్న సహాయలు తాత్కాలికంగా ఉండేవి, అలాకాక వారి జీవితానికి ఒక అర్ధం తెలియచేసే విధంగా, అందరూ సామరస్యంతో, ఎప్పుడు ఆనందంగా బతికేలా చేసే శాశ్వతమైన జ్ఞానాన్ని ఇచ్చే జీవన విద్య తరగతులను chdhc.org ద్వారా మొదలుపెట్టాము అని చెప్పినప్పుడు ఆయన సంతోషించారు.
మన సేవలను మెచ్చుకొని, మమ్మల్ని ఆశీర్వదించారు.
అశ్వా సభ్యులందరూ ఆయనను మన కార్యక్రమంలో చూసి ఆనందపరవసులయ్యారు, జీవితకాలం గుర్తుండే జ్ఞాపకాలను మిగుల్చుకున్నారు.
ఈ లింక్ లో సిరివెన్నెల గారి మొత్తం స్పీచ్ వినవచ్చును
https://youtu.be/5SzhXDbxUaA
టీం CHDHC
9948885111
Comments